Sun Dec 22 2024 22:52:45 GMT+0000 (Coordinated Universal Time)
మెగాస్టార్ చిరంజీవి విమర్శలకు.. కొడాలి నాని కౌంటర్
చాలా రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న మెగా స్టార్ చిరంజీవి.. ఇటీవల
గుడివాడ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది పకోడీగాళ్లు ఉన్నారు. వాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహా ఇస్తున్నారని అన్నారు. అలాంటి వాళ్లు తమ వాళ్లకు కూడా సలహాలిస్తే బాగుంటుందని అన్నారు. మనకెందుకురా బాబూ రాజకీయాలు.. మన డ్యాన్సులు, మన ఫైట్లు మనం చూసుకుందామని వాళ్లకు కూడా సలహా ఇస్తే మంచిదంటూ కొడాలి నాని అన్నారు.
చాలా రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న మెగా స్టార్ చిరంజీవి.. ఇటీవల కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంగా సినీ పరిశ్రమపై పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కడుపు నింపే పథకాలపై దృష్టి పెట్టాలని వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో ఈ వ్యాఖ్యలు చేశారు. మీ లాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి. పేద వారి కడుపు నింపే దిశగా ఆలోచించాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేకానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ ఇండస్ట్రీపై పడతారేంటి? అని అన్నారు. ఇటీవల ‘బ్రో’ సినిమా విషయంలో జరిగిన పలు ఘటనల నేపథ్యంలోనే చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story