Fri Dec 20 2024 07:27:24 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుకు ఆ శిక్ష తప్పదు
మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన పార్టీలు ఉండవని ఆయన తెలిపారు.
మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన పార్టీలు ఉండవని ఆయన తెలిపారు. ఆ రెండు పార్టీల పీడ విరగడవుతుందని అన్నారు. పవన్ కల్యాణ్ చిరంజీవి, చంద్రబాబు ఎన్టీఆర్ ఫొటోలతో ప్రచారం చేయకుండా ఒంటరిగా ప్రచారం చేయాలని ఆయన సవాల్ విసిరారు. వాళ్లిద్దరూ లేకుంటే వీళ్లిద్దరూ గుండు సున్నా అని తెలిపారు. టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ చేతికి అప్పగించక తప్పని పరిస్థితులు చంద్రబాబుకు ఏర్పడతాయని కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ కు చేసిన ద్రోహానికి ఆ దేవుడనే వాడు ఉంటే చంద్రబాబు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడని శాపనార్థాలు పెట్టారు.
చిరంజీవి పుట్టిన రోజు నాడే....
చంద్రబాబు ను నమ్మి ఆ పార్టీలో ఎవరూ ఉండరని అన్నారు. బీజేపీ కూడా జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీని అప్పగించే యోచనలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ, షా లు తలచుకుంటే ఏదైనా జరుగుతుందని అన్నారు. వైసీపీకి అరవై శాతం ఓట్లు ఉన్నాయని, ఎవరు కలసి వచ్చినా వైసీపీని ఓడించడం సాధ్యం కాదని తెలిపారు. పవన్ కల్యాణ్, చంద్రబాబులను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. పవన్ కల్యాణ్ ది నిలకడలేని మనస్తత్వం అన్నారు. తన అన్న చిరంజీవి పుట్టినరోజు పెట్టుకుని ఆరోజే ఆయన రాజకీయ కార్యక్రమాలను పెట్టుకోవడాన్ని చూసి సొంత పార్టీ అభిమానులే ఆశ్చర్యపోతున్నారని కొడాలి నాని అన్నారు.
Next Story