Sun Dec 22 2024 22:55:31 GMT+0000 (Coordinated Universal Time)
Kodali Nani: ప్లాన్ చేసి.. కొడాలి నాని పీఏపై దాడి
నాని పీఏ ఆచంట లక్ష్మోజీపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు
కొడాలి నాని మాజీ పీఏపై దాడి జరిగింది. నాని పీఏ ఆచంట లక్ష్మోజీపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు. మచిలీపట్నంలో పౌరసరఫరాలశాఖలో విధులు పూర్తిచేసుకుని వస్తున్న లక్ష్మోజీపై స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులోని సీఎస్ఐ చర్చి వద్ద ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన లక్ష్మోజీని చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తలకు తీవ్ర గాయమవడంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం లక్ష్మోజీని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. రైల్వే స్టేషన్ పక్కనే సీఎస్ఐ చర్చి ఆవరణలో తన ద్విచక్ర వాహనాన్ని తీస్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు లక్ష్మోజీపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎనిమిది మంది వ్యక్తులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. లక్ష్మోజీపై దాడిచేసి అక్కడి నుంచి దుండగులు పరారయ్యారు. ఎస్పీ గంగాధరరావు గుడివాడ చేరుకొని సీఎస్ఐ చర్చి వద్ద ఘటన స్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
కొడాలి నాని మాజీ పీఏ ఆచంట లక్ష్మోజీపై వ్యక్తులు దాడి.మచిలీపట్నంలో పౌరసరఫరాలశాఖలో విధులు పూర్తిచేసుకుని వస్తున్న లక్ష్మోజీపై స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులోని సీఎస్ఐ చర్చి వద్ద ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేశారు.
Next Story