Tue Mar 11 2025 06:30:09 GMT+0000 (Coordinated Universal Time)
అదే నిజమైతే నేను ఆత్మహత్య చేసుకుంటా... నాని సంచలన ప్రకటన
గుడివాడ ఘటనపై మంత్రి కొడాలి నాని స్పందించారు. ఆరోపణలను నిరూపిస్తే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు.

గుడివాడ ఘటనపై మంత్రి కొడాలి నాని స్పందించారు. తన కె. కన్వెన్షన్ సెంటర్ లో కేసినో జరిగిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, పెట్రోలు పోసుకుని తగలబెట్టుకుంటానని కొడాలి నాని అన్నారు. తన కె కన్వెన్షన్ సెంటర్ రెండున్నర ఎకరాల్లో ఉంటుందని. సంక్రాంతి పండగకు అక్కడ మామూలుగా జరిగే ఎడ్ల పందేలు, కోడిపందేలు, బండలాగుడు పోటీలు జరిగాయని, అంతే తప్ప కేసినో వంటివి జరగలేదని చెప్పారు.
గుడివాడకు ఎవరొచ్చినా?
ఎవరొచ్చినా గుడివాడలో తనను టీడీపీ ఏం చేయలేదని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మతిస్థిమితం కోల్పోయి పిచ్చ పిచ్చగా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు పెడిగ్రీ తిన్న కొన్ని కుక్కలు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కొడాలి నాని మండి పడ్డారు. కొన్ని మీడియా సంస్థలు తనపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని, వాటిని తాను లెక్క చేయనని, ప్రజలకు తాను ఏంటో తెలుసునని కొడాలి నాని చెప్పారు. తన కే కన్వెన్షన్ సెంటర్ కు టీడీపీ నేతలు తప్పించి ఎవరైనా వచ్చి విచారణ చేసుకోవచ్చని తెలిపారు.
Next Story