Fri Dec 20 2024 07:20:14 GMT+0000 (Coordinated Universal Time)
ప్లీనరీలో కొడాలి నాని ఫైర్
ముఖ్యమంత్రి జగన్ ను సీఎం కుర్చీ నుంచి దించాలని నలుగురు ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని అన్నారు
ముఖ్యమంత్రి జగన్ ను సీఎం కుర్చీ నుంచి దించాలని నలుగురు ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని అన్నారు. ఆ నలుగురు దొంగల ముఠాగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. దుష్టచతుష్టయం అనే అంశంపై వైసీపీ ప్లీనరీలో కొడాలి నాని మాట్లాడారు. ఉదయం నుంచి రాత్రి వరకూ దుష్ప్రచారం చేయడమే వీరి పని అని చెప్పారు. చంద్రబాబును సీఎంగా చేయాలని రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ 5 నాయుడు కంకణం కట్టుకున్నారని చెప్పారు. వీరికి ఎవరూ భయపడే ప్రసక్తి లేదని చెప్పారు.
పథకాల అమలులో....
ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనినీ విమర్శించడమే వీరు ధ్యేయంగా పెట్టుకున్నారని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ఎప్పుడైనా జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు అమలు చేశారా? అని ప్రశ్నించారు. 95 శాతం హామీలను అమలు చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. పేదల కోసం జగన్ నిత్యం పరితపిస్తూనే ఉంటారని, చంద్రబాబు లాంటి చవట దద్దమ్మ దేశంలోనే ఎవరూ లేరని కొడాలి నాని ఫైర్ అయ్యారు.
Next Story