Mon Dec 23 2024 09:32:20 GMT+0000 (Coordinated Universal Time)
Kodali Nani : గుడివాడ నాదే... గన్నవరం ఆయనదే
గుడివాడ నుంచి తానే పోటీ చేస్తానని కొడాలి నాని తెలిపారు. గన్నవరం నుంచి వల్లభనేని వంశీ పోటీ చేస్తారని కూడా ఆయన తెలిపారు
Kodali Nani:గుడివాడ నుంచి తానే పోటీ చేస్తానని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. గన్నవరం నుంచి వల్లభనేని వంశీ పోటీ చేస్తారని కూడా ఆయన తెలిపారు. గుడివాడలో నిన్న ఫ్లెక్సీలు వెలిసిన నేపథ్యంలో కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేశారు. గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న హనుమంతరావుకు అభినందనలు అంటూ పట్టణంలో వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. దీంతో మున్సిపల్ శాఖ అధికారులు ఆ ఫ్లెక్సీలను వెంటనే తొలగించారు.
టీడీపీ నేతల వల్లనే...
అయితే దీనిపై స్పందించిన కొడాలని తాను గుడివాడ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. అలాగే గన్నవరం నుంచి వల్లభనేని వంశీ కూడా పోటీ చేస్తారన్న ఆయన.. కొందరు టీడీపీ నేతలు తమ పార్టీ క్యాడర్ లో అయోమయం సృష్టించేందుకే ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. జగన్ నిర్ణయం మేరకే తాము నడచుకుంటామని, తాను వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడని హనుమంతరావు కూడా తెలిపారు. తాను గుడివాడ నుంచి పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారాన్ని హనుమంతరావు కూడా కొట్టిపారేశారు.
Next Story