Tue Mar 11 2025 06:17:54 GMT+0000 (Coordinated Universal Time)
నాని ఒప్పుకున్నారు... గుడివాడలోనే జరిగింది.. నాకు, వంశీకి కామన్ ఫ్రెండ్సే పెట్టారు
వల్లభనేని వంశీ, తనకు సంబంధించిన కామన్ ఫ్రెండ్స్ గుడివాడలో ఆటలను ఏర్పాటు చేసిన మాట వాస్తవమేనని కొడాలి నాని చెప్పారు.

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తనకు సంబంధించిన కామన్ ఫ్రెండ్స్ గుడివాడలో ఆటలను ఏర్పాటు చేసిన మాట వాస్తవమేనని కొడాలి నాని చెప్పారు. అయితే అది కేసినో కాదని అన్నారు. తమ ప్రాంతంలో సంక్రాంతి పండగకు ఎటువంటి ఏర్పాట్లు చేయకుంటే ఎమ్మెల్యే ను పనికిరాని వాడిగా చూస్తారన్నారు. కానీ ఆ ఈవెంట్ తన కన్వెన్షన్ సెంటర్ లో జరగలేదని చెప్పారు. తన నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి తన మంచి గురించే ఏర్పాటు చేసి ఉండవచ్చని అన్నారు.
తన కన్వెన్షన్ సెంటర్ లో....
గుడివాడలో ఈవెంట్ జరిగిందని వాస్తవమేనని, కానీ తన కన్వెన్షన్ సెంటర్ లో జరగలేదని చెప్పారు. తనపై టీడీపీ నేతలు లేనిపోని అభాండాలు వేశారన్నారు. తనకు, ఆ ఈవెంట్ కు అసలు సంబంధమే లేదన్నారు. పండగ పూట ఎవరో ఒకరు అలాంటి ఈవెంట్ లు పెట్టుకుంటారని, దానివల్ల వంశీకి నాకు ఎటువంటి లబ్ది జరగదన్నారు. తన కన్వెన్షన్ సెంటర్ లో ఈవెంట్ జరిగినట్లు నిరూపిస్తే ఇప్పటికీ తాను విసిరిన ఛాలెంజ్ కు కట్టుబడి ఉన్నానని చెప్పారు.
Next Story