Mon Dec 23 2024 16:27:41 GMT+0000 (Coordinated Universal Time)
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను : వైసీపీ ఎమ్మెల్యే
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ తెలిపారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఆయనను సొంత పార్టీ నేతలే నిలదీశారు. దీంతో సుధాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన లేదని ఆయన చెప్పారు. ప్రతి ఇంటికి తిరుగుతున్న ఎమ్మెల్యే సుధాకర్ ను సొంత పార్టీ కార్యకర్తలు ప్రశ్నించారు.
నిలదీయడంతో...
ఎమ్మెల్యే అయిన తర్వాత గెలుపు కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి ఇతర పార్టీ నేతలకు అందలం ఎక్కించారని ఆరోపించారు. టిక్కెట్ వచ్చేందుకు శ్రమించిన వారిని కూడా పక్కన పెట్టారని విమర్శించారు. నమ్మకద్రోహం చేశారని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించడంతో కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story