Mon Dec 23 2024 07:47:22 GMT+0000 (Coordinated Universal Time)
డిప్యూటీ స్పీకర్ గా కోన రాజీనామా
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. గురువారం శాసనసభ ప్రారంభమయిన తర్వాత ప్రశ్నోత్తరాలు ముగించిన అనంతరం కోన రఘుపతి కొద్దిసేపు సభను నిర్వహించారు. అనంతరం తన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాంకు అందచేశారు.
కోలగట్లకు...
కోన రఘుపతి స్థానంలో కొత్త డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఈ సమావేశాల్లోనే జరగనుంది. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలన్న యోచనలో జగన్ ఉన్నారు. వైశ్య సామాజికవర్గం నుంచి మంత్రి వర్గంలో ఎవరూ లేకపోవడంతో కేబినెట్ హోదా కలిగిన డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంపిక చేయనున్నారని సమాచారం. అందుకే మూడేళ్ల పాటు డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన కోన రఘుపతి రాజీనామా చేశారన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
Next Story