Sun Dec 22 2024 23:22:59 GMT+0000 (Coordinated Universal Time)
మరో 24 గంటల నో ఇంటర్నెట్
మరో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపేసినట్లు కోనసీమ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి తెలిపారు
కోనసీమ జిల్లాలో ఇంటర్నెట్ గత వారం రోజులకు పైగా నిలిపివేశారు. మరో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపేసినట్లు కోనసీమ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి తెలిపారు. వదంతులను వ్యాప్తి చేయకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పరిస్థితిని బట్టి ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించే విషయంపై చర్య తీసుకుంటామని ఆయన తెలిపారు.
భారీగా పోలీసులు.....
ఈరోజు కాంగ్రెస్ నేతలు అమలాపురం పర్యటిస్తున్నారు. దీంతో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయని భారీ ఎత్తున పోలీసు బలగాలను అమలాపురంలో దించారు. బయటవారిని ఎవ్వరినీ అమలాపురంలోకి అనుమతించేది లేదని పోలీసులు చెబుతున్నారు. గత నెల 24వ తేదీన జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఇంటర్నెట్ ను పూర్తిగా స్థంభింప చేశారు. దీంతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకు లావాదేవీల విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా వర్క్ ఫ్రం హోం నిర్వహిస్తున్న ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ ను వెంటనే కోనసీమలో పునరుద్ధరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా డిమాండ్ చేశారు. మరో 24 గంటల పాటు కోనసీమ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు.
Next Story