Mon Dec 23 2024 16:09:29 GMT+0000 (Coordinated Universal Time)
లాస్ట్ మినిట్ లో ఛేంజ్ అవుతుందా? టీడీపీలో కొండపల్లి టెన్షన్
కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక మరికాసేపట్లో జరగనుంది. టీడీపీ, వైసీపీలు కౌన్సిలర్లతో క్యాంపులను నిర్వహిస్తున్నాయి
కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక మరికాసేపట్లో జరగనుంది. టీడీపీ, వైసీపీలు కౌన్సిలర్లతో క్యాంపులను నిర్వహిస్తున్నాయి. క్యాంపుల నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి తరలించే ఏర్పాట్లు ఇరు పార్టీలు చేసుకున్నాయి. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లు తమ పార్టీ కౌన్సిలర్లను దగ్గరుండి కార్యాలయానికి తీసుకువస్తున్నారు.
ఒక్క ఓటు మారితే...?
వైసీపీకి ఎక్స్ అఫిషియో ఓటుతో కలిపి 15, టీడీపీకి ఎక్స్ అఫిషియో ఓటుతో కలిపి పదహారు ఓట్లున్నాయి. అయితే చివరి నిమిషంలో ఏదైనా జరుగుతుందేమోనన్న టెన్షన్ లో టీడీపీ ఉంది. కార్యాలయానికి తీసుకు వచ్చే ముందే కౌన్సిలర్లకు కేశినేని నాని కౌన్సెలింగ్ చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఛైర్మన్ ఎన్నికలో వ్యవహరించాలని నాని కౌన్సిలర్లకు క్లాస్ పీకారు. చివరి నిమిషంలో సీన్ మారుతుందేమోనన్న ఉత్కంఠ కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో నెలకొంది.
Next Story