Tue Nov 05 2024 12:36:51 GMT+0000 (Coordinated Universal Time)
కొండపల్లి ఎన్నిక ఫలితంపై హైకోర్టు విచారణ వాయిదా
కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరిగింది. అధికారులు ఎన్నికల ఫలితాన్ని హైకోర్టు కు సీల్డ్ కవర్ లో అందించారు.
కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరిగింది. అధికారులు ఎన్నికల ఫలితాన్ని హైకోర్టు కు సీల్డ్ కవర్ లో అందించారు. అయితే విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటు పై విచారణ జరిపింది. నాని ఓటు హక్కుపై హైకోర్టు తీర్పు చెప్పాల్సి ఉంది. అయితే విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
కేశినేని నాని ఓటు...?
కొండపల్లి మున్సిపాలిటీలో 19 వార్డులుండగా వైసీపీ, టీడీపీ చెరి 14 స్థానాలు గెలిచాయి. ఒక స్థానంలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం పదిహేనుకు పెరిగింది. టీడీపీ ఛైర్మన్ గా చిట్టిబాబు పోటీ చేశారు. ఎన్నిక పూర్తయింది. కేశినేని నాని ఓటు చెల్లుతుందా? లేదా? అన్న దానిపై హైకోర్టు తీర్పు చెప్పాల్సి ఉంది. కేశినేని నానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చినట్లవుతుంది. వైసీపీకి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు వేశారు. సోమవారం కొండపల్లి చైర్మన్ భవితవ్యం తేలనుంది.
Next Story