Mon Dec 23 2024 16:09:42 GMT+0000 (Coordinated Universal Time)
గన్మెన్ అయితే మనసు ఉండదా?
మీడియా సమావేశంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గన్మెన్లు ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వారిద్దరినీ కోటంరెడ్డి ఓదార్చారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరు గన్మెన్లను ప్రభుత్వం తొలగించింది. ఉన్న మిగిలిన ఇద్దరు గన్మెన్లను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పంపించివేశారు. ఈ విషయాన్ని ఆయన మీడియా సమావేశంలో ప్రకటిస్తున్నప్పుడు గన్మెన్లు ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వారిద్దరినీ కోటంరెడ్డి ఓదార్చారు. తనకు గన్మెన్ గా ఉన్నా లేకున్నా వారికి అండగా ఉంటానని కోటంరెడ్డి ఈ సందర్భంగా అన్నారు. రమేష్, ధనుంజయ్ ఇద్దరూ తనకు ఇష్టమైన వ్యక్తులని వారిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నానని కోటంరెడ్డి చెప్పారు.
తన వెంటే ఉన్నా...
కొన్నేళ్ల నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వద్ద వారు గన్మెన్లుగా పనిచేస్తున్నారు. ఈరోజు మీడియా సమావేశం పెట్టి వారిద్దరినీ కూడా పంపించి వేస్తున్నట్లు ప్రకటించారు. అదనంగా ఇచ్చిన గన్మెన్లను ప్రభుత్వం ఇద్దరినీ వెనక్కు తీసుకోవడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నారు. గన్మెన్లను తన నుంచి వేరు చేసినా తాను చచ్చేంత వరకూ వారి సేవలను మర్చిపోలేనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మీడియా సమవేశంలో గన్మెన్లు ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. గన్మెన్లు లేకపోయినా తాను ఒంటిరిగానే తిరుగుతానని తెలిపారు.
Next Story