Sat Dec 21 2024 13:22:26 GMT+0000 (Coordinated Universal Time)
అసోం చీఫ్ సెక్రటరీగా సిక్కోలు వాసి
అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కోత రవిని ఆ ప్రభుత్వం నియమించింది.
అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగువాడు నియమితులయ్యారు. అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కోత రవిని ఆ ప్రభుత్వం నియమించింది. కోత రవి సొంత గ్రామం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో నియమితులు కావడం పట్ల ఆ గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా జిల్లా వాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అసోం ప్రభుత్వంలో...
అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కోత రవి 1993వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన అసోం ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పవన్ కుమార్ బోర్తకూర్ పదవీకాలం ముగియడంతో కోత రవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story