Mon Dec 23 2024 18:05:11 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ప్రధాని కావడం ఖాయం
ముఖ్యమంత్రిగా జగన్ మళ్లీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు
ముఖ్యమంత్రిగా జగన్ మళ్లీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. ఆయన నియోజకవర్గంలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరే నేత చేయలేదన్నారు. అందుకే ఆయనకు ప్రజల్లో ఆదరణ ఇంకా తగ్గలేదన్నారు. జగన్ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఏదో ఒకరోజు జగన్ ప్రధాని ఖచ్చితంగా అవుతారని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు.
నమ్మే పరిస్థితి లేదు....
చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఆయన అబద్దాలు చెప్పి అనేక సార్లు అధికారంలోకి వచ్చారని, ఆయన నిజస్వరూపాన్ని ప్రజలు గుర్తించారన్నారు. అందరినీ మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది అని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలను పూర్తిగా విస్మరించే చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఎవరూ అనుకోరని ఆయన వ్యాఖ్యానించారు.
Next Story