Tue Dec 24 2024 01:41:49 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ను వదిలిపెట్టను : నల్లపురెడ్డి
తాను పార్టీ మారబోనని, అదంతా ప్రచారం మాత్రమేనని కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పష్టం చేశారు
తాను పార్టీ మారబోనని, అదంతా ప్రచారం మాత్రమేనని కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. చివరి వరకూ తాను జగన్ తోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తనపై ప్రచారం చంద్రబాబు కుట్ర అని, ఒకవర్గం మీడియాలో తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు.
జగన్ వెంటే...
తాను జగన్ వెంటే నడుస్తానని, మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి తనకు లేదన్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సరైన సమయంలో అది వస్తే దానిని ఎవరూ ఆపలేరని కూడా వ్యాఖ్యానించారు. పార్టీ మారతారంటూ తనపై వస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మ వద్దని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోరారు. ఈ ప్రచారం చేయడం వల్ల లబ్ది పొందాలనుకుంటున్న టీడీపీకి ప్రజలు సరైన పద్థతిలో గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.
Next Story