Wed Jan 15 2025 16:57:10 GMT+0000 (Coordinated Universal Time)
రేపు కేంద్రం సమావేశం.. ఇరు రాష్ట్రాల సీఎస్ లు?
కృష్ణా, గోదావరి జలాల బోర్డు సమావేశం రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలో జరగనుంది
కృష్ణా, గోదావరి జలాల బోర్డు సమావేశం రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలో జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కృష్ణా, గోదావరి జలాల బోర్డు గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి నెలలు గడుస్తుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు ఈ గెజిట్ నోటిఫికేషన్ ను అమలు చేయడం లేదు.
చీఫ్ సెక్రటరీలకు...
దీనిపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు. రేపటి సమావేశానికి ఖచ్చితంగా హాజరు కావాలని కోరారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
Next Story