Wed Jan 15 2025 23:51:47 GMT+0000 (Coordinated Universal Time)
కృష్ణపట్నంలో టెన్షన్.. ఆనందయ్య ఇంటివద్ద గ్రామస్తుల ధర్నా
తమను కాదని.. మందు పంపిణీ చేస్తే.. ఆనందయ్య తీవ్రపరిణామాలను ఎదుర్కోక తప్పదని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. అసలు గ్రామస్తులు ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలుసా ?
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు ఆనందయ్య ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. ఆనందయ్య కరోనా(ఒమిక్రాన్) మందు పంపిణీ చేయడానికి వీల్లేదంటూ ఆందోళన చేస్తున్నారు. తమను కాదని.. మందు పంపిణీ చేస్తే.. ఆనందయ్య తీవ్రపరిణామాలను ఎదుర్కోక తప్పదని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. అసలు గ్రామస్తులు ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలుసా ? ఒమిక్రాన్ ఆనందయ్య ఇచ్చే నాటు మందు కోసం.. ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది కృష్ణపట్నానికి క్యూ కడుతున్నారు.
ఆనందయ్యపై గ్రామస్తుల మండిపాటు
ఇలా ఒమిక్రాన్ మందు కోసం వేలసంఖ్యలో బాధితులు తమ గ్రామానికి రావడం వల్ల తమకు కూడా కరోనా సోకుతుందని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్ కు మందు కనిపెట్టినట్లుగా ఆనందయ్య అసత్య ప్రచారం చేస్తున్నాడంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు. దీంతో ఆనందయ్య ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తన మందును పంపిణీ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని చెప్తున్నాడు ఆనందయ్య. కరోనా మందు కోసం చాలా మంది తనవద్దకు వస్తున్నారని.. వారందరికీ మందు ఇచ్చి రక్షించాలంటే.. ఆందోళన చేసే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆనందయ్య కోరుతున్నాడు.
Next Story