Wed Dec 18 2024 22:17:38 GMT+0000 (Coordinated Universal Time)
నటి కేసులో తీర్పుకు వేళాయె
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఓ నటికి
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఓ నటికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ బెయిల్ పిటిషన్‌పై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. తనను తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేసి వేధింపులకు గురి చేశారని కొద్ది రోజుల క్రితం నటి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు డెహ్రాడూన్‌లో ఆరెస్టు చేశారు. ఆయనను పోలీసులు కోర్టులో హజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు ఇవ్వడంతో జైలుకు తరలించారు.
విద్యాసాగర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం న్యాయస్థానం విచారణ జరపగా, జెత్వానీ తరపున న్యాయవాది శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. విద్యాసాగర్‌కు బెయిల్ మంజూరు చేస్తే ఆయన కేసును ప్రభావితం చేస్తారని, నిందితుడికి ఐపీఎస్ అధికారులు సైతం సహకరించారని తెలిపారు. విద్యాసాగర్‌కు బెయిల్ మంజూరు చేస్తే వాస్తవాలు బయటకు రాకుండా చేస్తారని అన్నారు. బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. నవంబర్ 16న బెయిల్ పిటిషన్‌పై తీర్పు రానుంది.
Next Story