Mon Dec 23 2024 12:52:48 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడాను.. లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్
ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాలపై దాడుల్ని ఖండిస్తున్నాను. విగ్రహాలపై దాడులు ఎవరు చేసినాతప్పే. ఎన్టీఆర్ విగ్రహంపై
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత, నటుడు సీనియర్ ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా నేడు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పలువురు నివాళులు అర్పించారు. లక్ష్మీపార్వతి కూడా ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న ఆమె.. ఎన్టీఆర్ సమాధి వద్ద కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో విగ్రహాల ధ్వంసంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాలపై దాడుల్ని ఖండిస్తున్నాను. విగ్రహాలపై దాడులు ఎవరు చేసినాతప్పే. ఎన్టీఆర్ విగ్రహంపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి సీఎం జగన్ హుందాగా వ్యహరించారు. ఈ ఘటనపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడి వాస్తవాలు తెలుసుకున్నాను. ఎవరి విగ్రహాలపై దాడులు చేసినా సహించకూడదు. ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా హుందాగా వ్యవహరించాలి అని పేర్కొన్నారు" లక్ష్మీపార్వతి.
Also Read : భారీ భూకంపం.. 25 మంది మృతి
అలాగే తాను ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. "26 ఏళ్ళ తర్వాత ఒక రహస్యం చెప్తున్నాను. ఎన్టీఆర్ చనిపోయినప్పడు ఆయన ఆత్మతో మాట్లాడాను. జీవిత రాజశేఖర్ లు మద్రాస్ తీసుకెళ్ళి నన్ను ఒక అమ్మాయితో మాట్లాడించారు. ఎన్టీఆర్ ఆత్మ ఓ 16ఏళ్ళ అమ్మాయిలో ప్రవేశించి నాతో అనేక విషయాలు పంచుకుంది" అంటూ మీడియాతో మాట్లాడారు. లక్ష్మీపార్వతి చేసిన ఈ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.
Next Story