Fri Dec 20 2024 08:56:30 GMT+0000 (Coordinated Universal Time)
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉందని.. ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం రద్దు బిల్లు-2024ను ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదన పట్ల సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండంటూ అయ్యన్నపాత్రుడు తెలిపారు. అందరూ అవును అన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించడమైనదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో తెలుగులో మాట్లాడి బిల్లును ప్రవేశపెట్టడం హర్షణీయం అని అయ్యన్నపాత్రుడిని మంత్రి పయ్యావుల కేశవ్ అభినందించారు. మా అందరికీ ఇష్టమైన బిల్లును తెలుగులో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సార్ అని అన్నారు.
ఇక అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ స్కూళ్ల అభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం చేపట్టిన ‘నాడు నేడు’ కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగిందని అన్నారు. కోట్ల రూపాయలు దోచుకున్నారని, దీనిపై విచారణ చేపడతామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యావిధానంలో కొత్త విధానం తీసుకొస్తామని తెలిపారు.
Next Story