Tue Apr 08 2025 03:58:19 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : రాజోలులో జనసేన ర్యాలీ చూశారా?
రాజోలు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి దేవా వర ప్రసాద్ నామినేషన్ ర్యాలీకి పెద్ద సంఖ్యలో అభిమానులు,కార్యకర్తలు హాజరయ్యారు.

రాజోలు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి దేవా వర ప్రసాద్ నామినేషన్ ర్యాలీకి పెద్ద సంఖ్యలో అభిమానులు,కార్యకర్తలు హాజరయ్యారు. రాజోలు నియోజకవర్గం వీధులన్నీ కిక్కిరిసి పోయాయి. ఈ భారీ ర్యాలీలో దాదాపు 30 వేల మంది పాల్గొన్నట్లు అంచనా వేస్తున్నారు. రాజోలు నియోజకవర్గం గత ఎన్నికల్లోనూ జనసేన పార్టీ గెలిచింది.
భారీ సంఖ్యలో...
ఈసారి కూడా అక్కడ జనేసన పోటీకి దిగనుంది. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిగా ఏర్పడటంతో మూడు పార్టీల కార్యకర్తలు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 3 గంటలులగా ర్యాలీ కొనసాగుతుందంటే ఏ మేరకు ర్యాలీ నిర్వహిస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. రాజోలు నియోజకవర్గంలో మరోసారి జనసేన జెండా ఎగురుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకు ఈ ర్యాలీయే నిదర్శనమని వారు అంటున్నారు.
Next Story