Fri Dec 27 2024 22:23:26 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : రష్ మామూలుగా లేదుగా.. ఆదాయం కూడా అంతే
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు బారులు తీరారు
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు తిరుమలలో భక్తులు బారులు తీరారు. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు మంచినీరు, అన్న ప్రసాదాలను అందచేస్తున్నారు.
క్యూలైన్లు అన్నీ...
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆలయ ఆదాయం కూడా పెరుగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 71,488 మంది భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వీరిలో 19,137 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.17 కోట్ల రూపాయలు ఉందని అధికారులు వెల్లడించారు.
Next Story