Sun Dec 14 2025 05:49:17 GMT+0000 (Coordinated Universal Time)
Assembly : ఆ ముగ్గురూ వచ్చే సభకు రారని తెలియడంతో?
ఎన్నికలకు ముందు జరిగే అసెంబ్లీ చివరి సమావేశాలు కావడంతో లాబీల్లో ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరుగుతుంది

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. అయితే ఎన్నికలకు ముందు జరిగే చివరి సమావేశాలు కావడంతో లాబీల్లో ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరుగుతుంది. ముగ్గురు ప్రస్తుత శాసనసభ్యులు వచ్చే అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు. కొందరు రాజకీయంగా రిటైర్మెంట్ ప్రకటించగా, మరికొందరు రాజకీయాల్లో కొనసాగినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు.
వారితో ఎమ్మెల్యేలు...
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి పేర్ని నాని పోటీ చేయరు. ఆయన స్థానంలో కుమారుడు పేర్ని కిట్టూను బరిలోకి దింపుతున్నారు. ఇక తిరుపతి నియోజకవర్గం నుంచి భూమన కరుణాకర్ రెడ్డి కూడా పోటీ నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో అభినయ్ రెడ్డిని పార్టీ ఇన్ఛార్జిగా నియమించింది. ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరు. ఇక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తన స్థానంలో కుమారుడు మోహిత్ రెడ్డికి అవకాశం కల్పించారు. దీంతో ఈ ముగ్గురు నేతలు వచ్చే అసెంబ్లీకి రారని తెలిసి వారితో కలసి ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా మాట్లాడటం కనిపించింది.
Next Story

