Thu Dec 26 2024 17:38:59 GMT+0000 (Coordinated Universal Time)
ఆఖరి సోమవారం - శైవక్షేత్రాన్నికి పోటెత్తిన భక్తులు
కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి
కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలానికి నిన్నటి నుంచే భక్తులు అధికసంఖ్యలో రావడం ప్రారంభమయింది. దీంతో ఘాట్ రోడ్ లో ఒకింత ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనిని అధిగమించిందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆఖరి కార్తీకసోమవారం కావడంతో శ్రీశైలంలోని భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు శ్రీశైలంలో భక్తులు బారులు తీరారు.
వేముల వాడ రాజన్న ఆలయంలో...
మరోవైపు తెలంగాణలోని వేములవాడ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈరోజుతో కార్తీక సోమవారం ముగియగనుండటంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి వేముల వాడ రాజన్న ను దర్శించుకునేందుకు బారులు తీరారు. భక్తులు ఇబ్బంది పడకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయాన్నే స్నానమాచరించి కార్తీక దీపాలను వెలిగించిన అనంతరం స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరడంతో దర్శనానికి గంటలస మయం పడుతుందని అధికారులు తెలిపారు.
Next Story