Tue Dec 24 2024 13:40:57 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ
త్వరలో ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభను ఏర్పాటు చేయడానికి నేతలు సన్నాహాలు చేస్తున్నారు
త్వరలో ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభను ఏర్పాటు చేయడానికి నేతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే సభా వేదిక, తేదీలను ప్రకటించనున్నారు. నిన్న బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఆయనతో పాటు మరోనేత పార్థసారధి కూడా ఉన్నారు. తొలుత పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ వారిని ఆదేశించారు.
చేరికలు ఉండేలా...
పార్టీ బలోపేతంపై వారితో చర్చలు జరిపారు. వారికి పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న దానిపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఆవిర్భావ సభలో చేరికలు ఉండేలా చూడాలని కోరారు. తాను ఆవిర్భావ సభకు హాజరవుతానని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపినట్లు సమాచారం. దీంతో పార్టీ కార్యాలయం ఏర్పాటు, బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు.
Next Story