Mon Mar 31 2025 22:16:39 GMT+0000 (Coordinated Universal Time)
Ysrcp : గవర్నర్ ను కలిసిన వైసీపీ నేతలు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ భద్రత విషయంలో నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేశారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ భద్రత విషయంలో నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేశారు. గుంటూరు పర్యటనలో జగన్ కు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని వారు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని వైసీపీ నేతల బృందం కలసి జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చారు.
మాజీ ముఖ్యమంత్రిగా...
మాజీ ముఖ్యమంత్రిగా వైఎఎస్ జగన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుందని, అయితే ఆయనకు ఎక్కడకు వెళ్లినా భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని తెలిపారు. జగన్ భద్రతపై తమకు ఆందోళనగా ఉందని, రక్షణ కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వైసీపీ నేతలు గవర్నర్ ను కోరారు. జగన్ పర్యటనలో అనేక భద్రతా వైఫల్యాలు కనిపించాయని వారు తెలిపారు.
Next Story