Sun Dec 14 2025 06:09:42 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీలో చేరిన దెందులూరు టీడీపీ నేతలు
టీడీపీ నుంచి దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్య నేతలు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు

తెలుగుదేశం పార్టీ నుంచి దెందులూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ముఖ్య నేతలు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదహారో రోజు పాదయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నారాయణపురం స్టే పాయింట్లో ముఖ్యమంత్రిని టడీపీ నేతలు కలిశారు.
సీఎం సమక్షంలో...
టీడీపీ నేతలు ఆకుర్తి శేఖర్, గారపాటి వాసు, గౌడ సంఘం నేత మదు గంగాధర్ నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి కూడా పాల్గొన్నారు. వీరిచేరికతో దెందలూరులో వైసీపీ విజయం ఖాయమని పార్టీ నేతలు అంటున్నారు.
Next Story

