Mon Dec 23 2024 14:15:00 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో విచిత్రం...చనిపోయిన, రిటైర్ అయిన వారికి కూడా జీతాలు
చనిపోయిన వాళ్లకు కూడా జీతాలు వేశారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు
చనిపోయిన వాళ్లకు కూడా జీతాలు వేశారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. గత నెలలో చనిపోయిన వారికి, సస్పెండ్ అయిన వారికి, రిటైర్ అయిన వారికి జీతాలు వేశారని ఆరోపించారు. ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఉద్యోగులు చేయాల్సిన పనిని ప్రయివేటు ఏజెన్సీలకు ఎలా అప్పగిస్తారని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నించారు. క్రిమినల్ కేసులు మేము పెడితే ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? అని ప్రశ్నించారు.
పే స్లిప్పులు దహనం చేసి.....
జీతాలు వేసేందుకు ధన్యవాదాలు తెలిపారు. తమ సమ్మె నెలరోజుల పాటు నిరాటంకంగా సాగేందుకు ప్రభుత్వం ఈ సాయం చేసిందని వారు ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకుండా తన పంతాన్ని నెగ్గించుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. చర్చల పేరుతో డ్రామాలకు దిగిందన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు కొత్త పే స్లిప్ లను దహనం చేసి తమ నిరసనను తెలియచేశారు.
Next Story