Sat Jan 11 2025 14:49:08 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తిరుపతిలో చిరుత ...ఉద్యోగిపై దాడి
తిరుపతిలో చిరుత దాడి కలకలం సృష్టించింది. బైక్ పై వెళుతున్న టీటీడీ ఉద్యోగి మునిపై చిరుత దాడి చేసింది
తిరుపతిలో చిరుత దాడి కలకలం సృష్టించింది. బైక్ పై వెళుతున్న టీటీడీ ఉద్యోగి మునిపై చిరుత దాడి చేసింది. తిరుపతి సైన్స్ సెంటర్ వద్ద ఉన్నట్లుండి చిరుత బైక్ పై వెళుతున్న మునిపై దాడికి దిగింది. అయితే స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో వెంటనే చిరుత అతడిని వదిలి పరుగులు పెట్టింది. మునిగా చిరుత దాడిలో గాయాలయ్యాయి.
గాయపడిన మునిని...
గాయపడిన మునిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిరుత ఎక్కడినుంచి వచ్చిందన్న దానిపై అటవీ శాఖ అధికారులు ఘటన స్థలికి వచ్చిఆరా తీస్తున్నారు. రాత్రివేళ ఇటువైపు ఒంటరిగా బయటకు రావద్దని హెచ్చరించారు. చిరుత ఇక్కడే సంచరిస్తుంటుందని, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్థానికులను హెచ్చరించారు.
Next Story