Mon Dec 23 2024 02:38:50 GMT+0000 (Coordinated Universal Time)
ఆ చిరుత చిక్కేసింది
తిరుమలలో చిరుత చిక్కింది. చిన్నారి లక్షితను లాక్కెళ్లి చిరుత దాడి చేసి
తిరుమలలో చిరుత చిక్కింది. చిన్నారి లక్షితను లాక్కెళ్లి చిరుత దాడి చేసి చంపేసిన ఘటనను ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా చిరుతను పట్టుకోవాలని అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ సమీపంలో బోను ఏర్పాటు చేశారు. ఆ బోనులో ఆదివారం అర్థరాత్రి చిరుత చిక్కింది. అలిపిరి నడక దారిలోని ఏడో మైలు దగ్గర ఏర్పాటు చేసిన బోనులో చిరుత కనిపించింది. చిరుత వయసు ఐదేళ్లు ఉంటుందని చెబుతున్నారు. చిరుత చిక్కడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిరుతను తీసుకెళ్లి దూరంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టనున్నారు. జూన్ నెలలో కూడా ఓ చిన్నారిపై చిరుత దాడి చేసింది. అప్పుడు కూడా బోను ఏర్పాటు చేయగా చిరుత చిక్కింది. దానిని బంధించి కళ్యాణ్ ట్యాంకు సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన లక్షిత కుటుంబానికి టీటీడీ రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. శుక్రవారం రాత్రి నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన వినోద్ కుమార్, శశికళ దంపతులు కుమార్తె ఆరేళ్ల లక్షిత అలిపిరి నడక దారిలో కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. అందరూ కలిసి పాపం కోసం గాలించగా.. శనివారం ఉదయం నరసింహస్వామి ఆలయం దగ్గర లక్షిత మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే డెడ్బాడీని స్వాధీనం చేసుకుని తిరుపతి రుయాలో పోస్ట్మార్ట్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.
Next Story