Sun Dec 22 2024 17:28:29 GMT+0000 (Coordinated Universal Time)
Leopard : తూర్పుగోదావరి జిల్లాలో చిరుత సంచారం
తూర్పు గోదావరి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది
తూర్పు గోదావరి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. జిల్లాలోని రాజానగరం మండలం లాలా చెరువు సమీపంలో చిరుతపులి సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. దీంతో వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి చిరుతపులి వచ్చి జంతువును నోట కరచుకుని తీసుకెళ్లిందని స్థానికులు చెబుతున్నారు.
ట్రాప్ కెమెరాలతో....
అయితే అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతాలనికి వచ్చి చిరుతపులి జాడలను పరిశీలిస్తున్నారు. అది చిరుతపులా? మరేదైనా జంతువా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. చిరుతపులి సంచారంతో అటవీ శాఖ అధికారులు అక్కడ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్థానికులు పెంపుడు జంతువులను రాత్రి వేళ బయటకు వదల వద్దని చెబుతున్నారు. దివాన్ చెరువు ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు చిరుతపులిని బంధించడానికి బోనును కూడా ఏర్పాటు చేశారు.
Next Story