Sun Dec 22 2024 21:57:59 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో మళ్లీ చిరుత కలకలం
తిరుమలలో అలిపిరి నడకమార్గంలో చిరుతపులి కనిపించడంతో
తిరుమలలో అలిపిరి నడకమార్గంలో చిరుతపులి కనిపించడంతో తిరుమల నడకదారి భక్తుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు తెలియడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. నడకమార్గంలోని నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత సంచరిస్తోంది. వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో చిరుత సంచరించింది. దీంతో చిరుత సంచారంపై టీటీడీ అప్రమత్తమైది. నడకదారి భక్తులను గుంపులుగా భద్రతా సిబ్బంది అనుమతిస్తోంది.
చిరుతల సంచారం పెరగడంతో కాలినడకన వెళ్లే భక్తులకు తక్షణ రక్షణ చర్యగా ఊతకర్రలను అందించారు టీటీడీ అధికారులు. చిన్న పిల్లలు కాలినడకన తిరుమలకు వెళ్లే సమయాన్ని సవరించారు. తాజాగా అలిపిరి మెట్ల మార్గం మీదుగా కాలి నడకన తిరుమలకు బయలుదేరి వెళ్లిన భక్తులకు నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో చిరుత కనిపించింది. దీనితో ఒక్కసారిగా వారు భయాందోళనలకు గురయ్యారు. టీటీడీకి సమాచారం ఇచ్చారు.
Next Story