Thu Dec 19 2024 15:12:46 GMT+0000 (Coordinated Universal Time)
మహనందిలో మళ్లీ ప్రత్యక్షమైన చిరుతపులి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహానందిలో మళ్లీ చిరుతపులి సంచారం కనిపించింది.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహానందిలో మళ్లీ చిరుతపులి సంచారం కనిపించింది. మహానందిలోని గోశాలలో చిరుతపులి రావడంతో భక్తులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల మహానంది ఆలయ పరిసర ప్రాంతంలో చిరుతపులి సంచారాన్ని గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులను ఫోన్ చేసి చెప్పారు.
పెంపుడు జంతువులను...
అటవీ శాఖ అధికారులు వచ్చి అక్కడ చిరుతపులి సంచారం నిజమేనని నిర్ధారించారు. పెంపుడు జంతువులను బయటకు వదల వద్దని అందరినీ హెచ్చరించి వెళ్లారు. మరోసారి చిరుతపులి మహానందిలోని గోశాల వద్ద తిరుగాడటంతో అధికారులు మళ్లీ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి వేళ ఒంటరిగా తిరగొద్దని అప్రమత్తం చేశారు. పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు బోన్లు, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు
Next Story