Sun Dec 22 2024 22:49:27 GMT+0000 (Coordinated Universal Time)
Leopard గుడ్ న్యూస్...మనిషిని చంపిన ఆ చిరుత బోనులో పడింది
నంద్యాల - గిద్దలూరు ఘాట్ రోడ్డులో సంచరిస్తున్న చిరుతపులి ఎట్టకేలకు బోనులో చిక్కింది
నంద్యాల - గిద్దలూరు ఘాట్ రోడ్డులో సంచరిస్తున్న చిరుతపులి ఎట్టకేలకు బోనులో చిక్కింది. ఈ చిరుతపులి ఇటీవల షేక్ మెహరున్నీసా అనే మహిళను చంపేసింది. అడవిలోకి కట్టెలకు వెళ్లిన మెహరున్నీసా పచర్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చంపేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఇంట్లో నిద్రిస్తున్న మరో వ్యక్తిపై కూడా దాడి చేసింది. దీంతో పచ్చర్ల గ్రామ ప్రాంత ప్రజలు ఆందోళన చెందతున్నారు. మృతి చెందిన షేక్ మెహరున్నీసా మాజీ సర్పంచ్ గా పనిచేశారు.
కుక్కను ఎరగా వేసి...
గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే మనిషిని చంపేయడంతో ట్రాప్ కెమెరాలను, బోన్లను ఏర్పాటు చేశారు. బోనులో కుక్కను ఉంచారు. కుక్క అరుపులు విని వచ్చిన చిరుతపులి ఎట్టకేకేలకు బోనులో చిక్కుకుంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత కొంత కాలంగా ఈ చిరుత సంచారంతో నిద్రలేమితో గడిపిన గ్రామస్థులు చిరుతపులి దొరకడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరుతపులిని ఇక్కడ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టవద్దని స్థానికులు కోరుతున్నారు.
Next Story