Mon Dec 23 2024 07:45:47 GMT+0000 (Coordinated Universal Time)
లక్షితను చంపిన చిరుత అక్కడ కనిపించింది
తిరుమల నడకదారిలో చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయింది లక్షిత అనే బాలిక
తిరుమల నడకదారిలో చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయింది లక్షిత అనే బాలిక. లక్షిత మృతికి చిరుతే కారణం తేల్చారు ఫోరెన్సిక్ నిపుణులు. చిరుతే దాడి చేసినట్లు స్పష్టం చేశారు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నిపుణులు. లక్షితను చిరుత చంపి తిన్నట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం అనంతరం లక్షిత మృతదేహాన్ని తిరుపతి రుయా మార్చురీ నుంచి నెల్లూరుకు తరలించారు. లక్షిత మృతితో ఇటు కుటుంబంలో, అటు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఆ చిరుత పట్టుకోడానికి అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత కదలికలను గుర్తించారు. 35వ మలుపు వద్ద చిరుత కదలికలను గుర్తించగా.. సైరన్ మోగించిన విజిలెన్స్ సిబ్బంది దాన్ని అడవిలోకి తరిమేశారు. చిరుతను బంధించడం కోసం సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన లక్షిత కుటుంబానికి టీటీడీ రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
నడక మార్గంలో భారీ భద్రతను కల్పించడంతోపాటు.. భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు. టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ, తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత దాడి చాలా బాధాకరమన్నారు. నడకమార్గంలో 500 సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నడక మార్గానికి ఇరువైపులా కంచె ఏర్పాటు చేసేందుకు సమగ్ర నివేదిక అందించాలని డి.ఎఫ్.ఓ ను ఆదేశించారు. చిరుత దాడి ఘటనపై సిసిఎఫ్ శ్రీ నాగేశ్వరరావు అధ్వర్యంలో సీన్ రీకనస్ట్రక్సన్ చేయించి, చిరుతను బంధించడం కోసం బోన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నడకదారిలో ఇప్పటికే 30 మంది టీటీడీ భద్రత సిబ్బంది, 10 మంది ఫారెస్ట్ సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. రెండు నడక మార్గాల్లో ఫారెస్టు, పోలీస్, టీటీడీ కలిసి మరింత ఎక్కువ మందితో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.
Next Story