Mon Dec 23 2024 15:04:19 GMT+0000 (Coordinated Universal Time)
అలిపిరి దారిలో కంచెను ఎందుకు ఏర్పాటు చేయలేరో చెప్పిన అధికారులు
తిరుమల నడకడారిలో వైల్డ్ లైఫ్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఆ ప్రాంతంలో కెమెరా
తిరుమల నడకదారిలో జంతువుల సంచారం ఎక్కువైపోయింది. ఎప్పుడు ఏ జంతువు దాడి చేస్తుందోనని భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. గత కొద్దిరోజులుగా చిరుతలు కలకలం రేపుతుండగా.. శ్రీవారి మెట్టు మార్గంలో తాజాగా ఎలుగుబంటి కనిపించింది. భక్తులు ఆందోళన చెందుతూ ఉండగా.. అటవీ శాఖ అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శాంతి ప్రియ పాండే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
తిరుమల నడకడారిలో వైల్డ్ లైఫ్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఆ ప్రాంతంలో కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నడక మార్గంలో కంచె ఏర్పాటు చేయడం కుదరదని.. దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. చెట్లను ఎక్కే చిరుత కంచెను సులువుగా దాటగలదని వివరించారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించకూడదని చెప్పారు. ఇవాళ పట్టుబడ్డ చిరుత డిఎన్ఏ కలెక్ట్ చేశామని. వాటి రక్తం, వెంట్రుకల నమూనాను సేకరించినట్లు తెలిపారు. రిపోర్టులు అందాకా అది మనిషిని తిన్నదా లేదా అన్నది నిర్ధారిస్తారని తెలిపారు. చిరుత దాడి ప్రమాదవశాత్తూ జరిగిందే తప్ప, తినాలని రాలేదని అన్నారు. నడకదారిలో మరిన్ని లైట్లు ఏర్పాటు చేయాలని.. ప్రతి 20 మీటర్ల దూరంలో సిబ్బంది నియమించాలని సూచించామని అన్నారు.
భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. నడకమార్గం సమీపంలోనే మరో 5 చిరుతలు సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల్లో గుర్తించామని, వాటిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. శేషాచలం అడవుల్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని, పట్టుబడ్డ చిరుతలను ఎస్వీ జూపార్క్కు తరలించనున్నట్లు చెప్పారు. సోమవారం ఉదయం పట్టుబడ్డ ఆడ చిరుతకు నాలుగేళ్లు అని, బాలికపై దాడి చేసిన చిరుత ఇదా.. కాదా.. అనేది పరిశీలిస్తామన్నారు. నడకదారిలో భక్తులు గుంపులుగా వెళ్లాలని, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత 15 ఏళ్లలోపు చిన్నారులకు నేటి నుంచి అనుమతి నిరాకరిస్తున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు ఘాట్రోడ్లో బైక్లకు అనుమతి లేదని తెలిపారు.
Next Story