Fri Dec 20 2024 05:28:00 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు మద్యం షాపుల కోసం లాటరీ
ఆంధ్రప్రదేశ్ లో మద్యం లాటరీ విధానం ఈరోజు ఉదయం నుంచి ప్రారంభం కానుంది
ఆంధ్రప్రదేశ్ లో మద్యం లాటరీ విధానం ఈరోజు ఉదయం నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఎనిమిది గంటల నుంచే జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎక్సైజ్ అధికారుల సూచనల మేరకు దుకాణాల క్రమ సంఖ్య ప్రకారం లాటరీని తీయనున్నారు. మద్యం దుకాణాలను లైసెన్స్లు చెల్లించడానికి ఈ లాటరీ తీయనున్నారు. మొత్తం 3,396 మద్యం షాపులకు 89,882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి 1797 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంటే ఒక్కొక్క షాపునకు 26 దరఖాస్తుల వరకూ వచ్చాయని అధికారులు తెలిపారు.
ఈ నెల 16 నుంచి...
లాటరీలో మద్యం దుకాణాలు వచ్చిన వారు ఈ నెల 16వ తేదీ నుంచి మద్యం షాపులను తెరుచుకోవచ్చని సూచించారు. అంటే అదే రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం విధానం అమలు కానుంది. నాణ్యమైన బ్రాండ్ల మద్యంతో పాటు అన్ని బ్రాండ్లు లభ్యమయ్యేలా చూసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని మద్యం తయారీ సంస్థలతో సంప్రదింపులు జరిపింది. అలాగే చౌకగా మద్యాన్ని అందించే ఏర్పాట్లు కూడా చేసింది. 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ అందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మేరకే ఈ కొత్త మద్యం విధానం అమలు చేయనున్నారు.
Next Story