Mon Nov 04 2024 18:30:13 GMT+0000 (Coordinated Universal Time)
మందుబాబులకు షాకింగ్ న్యూస్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో మద్యం దుకాణాలు మూడు రోజులకు పైగానే మూతపడనున్నాయి.
రెండు తెలుగు రాష్ట్ర్రాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో మద్యం దుకాణాలు మూడు రోజులకు పైగానే మూతపడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. మే 13వ తేదీన ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకూ జరుగుతుంది. వేసవి తీవ్రత కారణంగా మరో గంట సేపు ఎన్నికల కమిషన్ అధికారులు పోలింగ్ సమయాన్ని పొడిగించారు.
11వ తేదీ నుంచి...
అయితే ఈ నెల 11వ తేదీ నుంచి మద్యం దుకాణాలను మూసివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. వైన్ షాపులతో పాటు బార్లు కూడా క్లోజ్ చేయాలని కోరింది. మద్యం అమ్మకాలు జరిపితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది. మద్యం బాటిల్స్ దొరికినా వాటిని సీజ్ చేేస్తామని వార్నింగ్ లు ఇస్తుంది. మే 11వ తేదీ నుంచి మే 14 వ తేదీ ఉదయం వరకూ మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. దీంతో మూడు రోజుల పాటు మందుబాబులకు మద్యం అందుబాటులో ఉండదు.
Next Story