Ap Politics : చంద్రబాబు స్కూలు సిలబస్ మార్చారుగా..ఇక జగన్ కు దబిడి దిబిడే
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను నిలువరించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద గేమ్ ప్లాన్ రెడీ చేసినట్లే కనపడుుతుంది
ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సభలో మోదీని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిజమేననిపిస్తుంది. మీ స్కూల్.. నా స్కూల్ ఒకటేనని చంద్రబాబు అన్నది అభివృద్ధి.. విజన్ గురించి. అయితే ప్రత్యర్థిని కట్టడి చేయడానికి దూరం చేయడంలో కూడా ఇద్దరి స్కూలు ఒకటే. మోదీ మంత్రాంగంతోనే నేడు అనేక రాష్ట్రాల్లో కమలం పార్టీ జెంగా ఎగురగలిగింది. ఏ ఎన్నిక జరిగినా అది బీజేపీ ఖాతాలో పడటం సర్వసాధారణమయింది. జనాలకు కూడా ఇది పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన పనిలేకుండా పోయింది. ఎందుకంటే ముందుగానే బీజేపీ విజయాన్ని అంచనా వేసుకుంటున్నారు. ఇప్పడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే సిలబస్ ను పాటిస్తున్నట్లే కనిపిస్తుంది. ప్రత్యర్థులు బలంగా ఉన్న చోట వీక్ చేయడం లక్ష్యంా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. పైకి ఎవరికీ ఇది అర్థం కాకపోయినా లోతుగా అథ్యయనం చేసే రాజకీయ విశ్లేషకులకు మాత్రం ఇది సులువుగానే అర్థమవుతుంది.