Andhra Pradesh : ఏపీలో మోదీ గేమ్ మొదలయిందా?
ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోదీ గేమ్ మొదలయినట్లే కనిపిస్తుంది. నరేంద్ర మోదీని ఆషామాషీగా అనుకోవడానికి వీలులేదు
ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోదీ గేమ్ మొదలయినట్లే కనిపిస్తుంది. నరేంద్ర మోదీని ఆషామాషీగా అనుకోవడానికి వీలులేదు. ఆయన దూర దృష్టితో ఆలోచించి ఏ రాజకీయ నిర్ణయమైనా ఉంటుంది. అంతే తప్ప తాత్కాలికంగా ఎటువంటి డెసిషన్లు ఉండవు. అదే సమయంలో మనతో మోదీ అనుకూలంగా ఉన్నారనుకోవడం కూడా అంతే తప్పు అవుతుంది. ఎందుకంటే తనకు ఇబ్బందిగా మారతారనుకున్న వారిని మోదీ కట్టడి చేయడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తారన్నది దాదాపు దశాబ్దన్నర జాతీయ రాజకీయాలు చూసిన వారికి ఎవరికైనా ఇలాగే తెలుస్తుంది. మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆధారపడాల్సి వచ్చింది. ఆయన పైకి ఇద్దరితో నవ్వుతూ కనిపించినప్పటికీ లోలోపల మాత్రం ఇద్దరినీ రాజకీయంగా కొంత అణిచివేసే ప్రయత్నం చేస్తారన్నది రాజకీయ వర్గాల్లో సాగుతున్న విశ్లేుషణలు బట్టి అర్థమవుతుంది. అందులోనూ చంద్రబాబు లాంటి సీనియర్ నేతను కంట్రోల్ చేయడం మోదీకి అవసరం అని మోదీ ఖచ్చితంగా భావిస్తారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ