Mon Dec 23 2024 09:09:18 GMT+0000 (Coordinated Universal Time)
కూతురు ప్రేమ వివాహం దగ్గరుండి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన కూతురుకు
ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన కూతురుకు ప్రేమ పెళ్లిని దగ్గరుండి జరిపించారు. ఎమ్మెల్యే మొదటి కూతురు పల్లవి ప్రేమించిన పవన్ అనే యువకుడితో బొల్లవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలో పెళ్లి చేశారు. ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు. తన కూతురుకు ఇష్టమైన యువకుడితో పెళ్లి చేశానని రాచమల్లు చెప్పారు. వారిద్దరు కలిసి చదువుకున్న రోజుల్లో ఇష్టపడ్డారని తెలిపారు. డబ్బు, హోదా, కులం వంటి వాటికి విలువ ఇవ్వకుండా వారిద్దరు ఇష్టపడటంతో, వారి అంగీకారం ప్రకారం పెళ్లి చేసినట్లు తెలిపారు.
ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన మొదటి కూతురు పల్లవి ఓ వ్యక్తిని ప్రేమించింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని తన తండ్రితో చెప్పింది. ఆయన కులాంతర వివాహానికి అడ్డుపడలేదు. స్వయంగా వివాహం జరిపించారు. ఎమ్మెల్యే కుమార్తె చదువుకునే రోజుల్లో పవన్ అనే యువకుడిని ప్రేమించగా.. ఈ విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన పెళ్ళికి ఒప్పుకున్నారు. దీంతో బొల్లవరంలోని వేంకటేశ్వర ఆలయంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ పెళ్లి జరిగింది. అనంతరం ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు.
Next Story