Sat Nov 23 2024 04:39:39 GMT+0000 (Coordinated Universal Time)
24 గంటల్లో బలపడనున్న అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షసూచన
తాజాగా.. నాగశౌర్య పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఓ వార్త బయటికొచ్చింది. ఇండస్ట్రీలో పీఆర్ గా ఉన్న వంశీ కాక ఈ విషయాన్ని..
నైరుతి బంగాళాఖాతం - శ్రీలంక తీరాలను ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం.. రానున్న 24 గంటల్లో మరింత బలపడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ అల్పపీడనం ఈనెల 12వ తేదీ ఉదయం వరకూ.. వాయవ్య దిశగా తమిళనాడు-పుదుచ్చేరి వైపు పయనిస్తుందని, ఆ తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ వివరించింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావం, అల్పపీడనం కారణంగా పరిసరాల్లో 7.6 కి.మీ వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని తెలిపింది.
ఈ అల్పపీడనం ప్రభావంతో నేటి నుండి 13వ తేదీ వరకూ ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. చిత్తూరు జిల్లా, తిరుపతి సహా అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీతో పాటు తమిళనాడులోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ కోస్తాలో గంటకు 65 కి.మీల వేగంగా గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు సముద్రం మీదకు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Next Story