Mon Dec 23 2024 03:58:07 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : మాచర్ల టీడీపీకి షాకింగ్ న్యూస్... జగన్ పార్టీలో చేరిన కీలక నేత
మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కీలక నేత కొమ్మారెడ్డి చలమారెడ్డి వైసీపీలో చేరారు
మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కీలక నేత కొమ్మారెడ్డి చలమారెడ్డి వైసీపీలో చేరారు. ఆయన వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. మాచర్ల టీడీపీ మాజీ ఇన్ఛార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డి వైసీపీలో చేరారు. ఆయనకు జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయన వెంట ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి కూడా ఉన్నారు.
రెండు దశాబ్దాల నుంచి...
2014లో చలమారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1999 ఎన్నికల తర్వాత మాచర్లలో టీడీపీకి గెలుపు దక్కలేదు. చలమారెడ్డి చేరికతో వైసీపీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. వరసగా ఇన్ఛార్జులను మార్చడం, పిన్నెల్లి అక్కడ పాతుకుని పోయి ఉండటంతో టీడీపీకి అక్కడ గెలవడం కష్టంగా మారింది. ఈసారి చలమారెడ్డి చేరికతో పార్టీ మరింత బలపడిందని, వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
Next Story