Thu Dec 19 2024 12:01:00 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసులు కన్నుగప్పి పిన్నెల్లి మాచర్లను వీడి ఎక్కడకు వెళ్లారంటే?
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనిపించకుండా వెళ్లిపోయారు. ఆయనను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనిపించకుండా వెళ్లిపోయారు. ఆయనను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. అయితే పోలీసులు కళ్లుగప్పి ఆయన పరారయ్యారు. తన గన్ మెన్లను కూడా వదిలేసి ఆయన వెళ్లిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గన్ మెన్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పల్నాడులో అల్లర్లను అరికట్టేందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు
గృహనిర్బంధంలో ఉన్న...
అయితే ఇద్దరూ ఇంటిని విడిచి వెళ్లిపోవడం ఇప్పుడు పోలీసులకు సమస్యగా మారింది. వాళ్లిద్దరూ ఎక్కడకు వెళ్లారన్న దానిపై చర్చ జరుగుతుంది. అయితే పోలీసులు తనను అరెస్ట్ చేస్తారన్న భయంతోనే పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లారని చెబుతున్నారు. అయితే ఆయన హైదరాబాద్ కు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తాను వ్యక్తిగత పనుల కోసం హైదరాబాద్ లో ఉన్నారని ఆయన తెలిపారు. తాను ఎక్కడకూ పారిపోలేదని చెప్పారు.
Next Story