Mon Dec 23 2024 09:50:16 GMT+0000 (Coordinated Universal Time)
అందుకే నేను పోటీ నుంచి తప్పుకుంటున్నా : మాగుంట
తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మాగుంట రాఘవరెడ్డి తెలిపారు
తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మాగుంట రాఘవరెడ్డి తెలిపారు. ఒంగోలు పార్లమెంటు స్థానానికి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో సీనియర్ పార్లమెంటు సభ్యుడు టీడీపీలో ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అవసరమైన నిధులు తెచ్చే అవకాశముంటుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయంతో ఏకీభవించి ఈసారి తన తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డిపోటీ చేయనున్నారని రాఘవరెడ్డి తెలిపినట్లు ఒక ప్రకటన విడుదలయింది.
తాను ప్రజలకు...
అందుకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. తాను ఎప్పటిలాగే యువతకు, నాయకులకు మాత్రమే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఒంగోలు పార్లమెంటులో మాగుంట కుటుంబం ఎప్పుడూ ప్రజలకు తోడుగా ఉంటుందని రాఘవరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. దీంతో ఒంగోలు ఎంపీ టిక్కెట్ మాగుంట రాఘవరెడ్డి కాకుండా శ్రీనివాసులు రెడ్డికి ఖరారయినట్లు ఆయన పరోక్షంగా చెప్పేశారు.
Next Story