Mon Dec 23 2024 10:16:48 GMT+0000 (Coordinated Universal Time)
అప్రూవర్ గా మారిన వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అఫ్రూవర్ గా
ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అఫ్రూవర్ గా మారారు. ఇదే కేసులో ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డి అఫ్రూవర్ గా మారారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే 20 మంది నుండి కీలక సమాచారం సేకరించింది ఈడీ. హైదరాబాద్ నుండి ఢిల్లీకి నగదు బదిలీపై ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన సమాచారంతో పలువురిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ విషయమై ఈడీ అధికారులు దర్యాప్తులో మరింత దూకుడును పెంచింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డిలు బెయిల్ పై ఉన్నారు.
మాగుంట శ్రీనివాసులు రెడ్డి అఫ్రూవర్ గా మారడంతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆడిటర్ గా వ్యవహరించిన బుచ్చిబాబును ఈడీ అధికారులు విచారించారు. నాలుగైదు రోజుల క్రితం బుచ్చిబాబును ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారించారు. ఇదే కేసులో ఢిల్లీకి చెందిన దినేష్ అరోరా కూడ అఫ్రూవర్ గా మారారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కొందరు కీలకంగా వ్యవహరించారనే దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
Next Story