Mon Dec 23 2024 07:44:19 GMT+0000 (Coordinated Universal Time)
టెన్షన్ మధ్య యాత్ర.. నిరసనల హోరు
తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న అమరావతి రైతుల మహాపాద యాత్రకు అడగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి
అమరావతి రైతుల మహా పాదయాత్ర నేడు 34వ రోజుకు చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న ఈ యాత్రకు అడగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గో బ్యాక్.. మూడు రాజధానులు ముద్దు అంటూ నినాదాలతో నిరసనలు కొనసాగుతున్నాయి. చాగల్లు సమీపంలో ఈరోజు రైతుల పాదయాత్రకు నిరసన తెలియజేశారు. ఇటు రైతుల యాత్రకు టీడీపీ, జనసేన, సీపీఐ, సీీపీఎం, బీజేపీలు మద్దతు తెలుపుతున్నాయి.
రేపు విరామం...
అలాగే యాత్రకు నిరసన తెలుపుతున్న వారికి అధికార వైసీపీ మద్దతు ఉంది. దీంతో పోలీసులు ఎవరినీ కాదనలేక రైతుల మహాపాదయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈరోజు పాదయాత్ర పూర్తి చేసిన తర్వాత రేపు పాదయాత్రకు రైతులు విరామం ప్రకటించనున్నారు. ఎల్లుండి కొవ్వూరు మీదుగా రాజమండ్రికి పాదయాత్ర చేరుకోనుంది.
Next Story