Thu Jan 09 2025 02:11:42 GMT+0000 (Coordinated Universal Time)
పదిహేనో రోజుకు మహాపాదయాత్ర
రాజధాని రైతుల మహాపాదయాత్ర నేడు పదిహేనో రోజుకు చేరుకుంది. నవంబరు 1వ తేదీ నుంచి మహా పాదయాత్ర ప్రారంభమైంది
రాజధాని రైతుల మహాపాదయాత్ర నేడు పదిహేనో రోజుకు చేరుకుంది. నవంబరు 1వ తేదీ నుంచి మహా పాదయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుంది. హైకోర్టు అనుమతితో అమరావతి రాజధాని రైతులు తుళ్లూరు నుంచి తిరుపతి వరకూ పాదయాత్ర చేయడానికి సంకల్పించారు.
అన్ని పార్టీల మద్దతు....
దీనికి న్యాయస్థానం టు దేవస్థానం గా నామకరణం చేశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో పాదయాత్ర చేపట్టారు. అమరావతి రైతుల పాదయాత్రకు వైసీపీ మినహాయించి అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. నేడు ప్రకాశం జిల్లాలోని టంగుటూరి మండలం నిడమానూరు నుంచి యాత్ర ప్రారంభం కానుంది. నేడు 13.3 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర కొనసాగుతుంది.
Next Story