Sun Dec 22 2024 22:01:10 GMT+0000 (Coordinated Universal Time)
ప్రాణం తీసిన గుర్రపు స్వారీ
గుర్రపు స్వారీ చేస్తూ కింద పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది
గుర్రపు స్వారీ చేస్తూ కింద పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. గుర్రం పై ప్రయాణం ఆ వ్యక్తి ప్రాణాలు తీసింది. కర్నూలు జిల్లా మద్దికేరకు చెందిన పృథ్వీరాజ్ రాయుడు బీఎన్ పేట నుంచి గుర్రంపై వస్తున్నారు. అలా వస్తున్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడ్డారు.
తీవ్ర గాయాలు కావడంతో....
దీంతో పృధ్వీరాజ్ కు తీవ్ర గాయాలయ్యా యి. అయితే వెంటనే అతడిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పృథ్వీరాజ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం తర్వాత బంధువులకు అప్పగించనున్నారు.
Next Story